MUNCIPOLLS: ప్రచారం ముగిసింది.. ప్రలోభం మొదలైంది

ముగిసిన మున్సిపల్ ప్రచారం...చివరి రోజు హోరెత్తిన ప్రచారం...ఈ నెల 11వ తేదీన పోలింగ్

Update: 2026-02-09 15:15 GMT

తె­లం­గా­ణ­లో ము­న్సి­ప­ల్ ఎన్ని­క­ల­కు సం­బం­ధిం­చిన ప్ర­చార పర్వం ము­గి­సిం­ది. సో­మ­వా­రం సా­యం­త్రం­తో పు­ర­పా­లి­కల ఎన్ని­కల ప్ర­చా­రా­ని­కి అధి­కా­రి­కం­గా తె­ర­ప­డిం­ది. గత కొ­న్ని రో­జు­లు­గా నేతల ప్ర­సం­గా­ల­తో హో­రె­త్తిన మై­కు­లు ఇక మూ­గ­బో­యా­యి. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 116 ము­న్సి­పా­లి­టీ­లు, 7 ము­న్సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్ల­కు ని­ర్వ­హిం­చ­ను­న్న ఎన్ని­కల ప్ర­చా­రం ము­గి­య­డం­తో పో­లిం­గ్‌­కు రంగం సి­ద్ధ­మ­వు­తోం­ది. ప్ర­చా­రం ము­గి­సిన నే­ప­థ్యం­లో ఎన్ని­కల కమి­ష­న్ ఏర్పా­ట్ల­పై దృ­ష్టి సా­రిం­చిం­ది. కలె­క్ట­ర్లు, ఎస్పీ­లు, ఎన్ని­కల పరి­శీ­ల­కు­లు, కో­ఆ­ర్డి­నే­ట­ర్ల­తో వీ­డి­యో కా­న్ఫ­రె­న్స్ ని­ర్వ­హిం­చిన ఎన్ని­కల అధి­కా­రు­లు, పో­లిం­గ్ ఏర్పా­ట్లు, బ్యా­లె­ట్ బా­క్సుల తర­లిం­పు, ఎన్ని­కల సా­మ­గ్రి పం­పి­ణీ వంటి అం­శా­ల­పై సమ­గ్రం­గా చర్చిం­చా­రు. ఈ నెల 11వ తే­దీన పో­లిం­గ్ ని­ర్వ­హిం­చి, 13వ తే­దీన ఓట్ల లె­క్కిం­పు చే­ప­ట్టి ఫలి­తా­ల­ను ప్ర­క­టిం­చ­ను­న్నా­రు. పోలింగ్, ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ప్ర­చా­రా­ని­కి చి­వ­రి రోజు కా­వ­డం­తో ప్ర­ధాన రా­జ­కీయ పా­ర్టీ­లు తమ అగ్ర­నే­త­ల­ను రం­గం­లో­కి దిం­పా­యి. ఓట­ర్ల­ను ఆక­ట్టు­కు­నే­లా వి­స్తృత ప్ర­చా­రం ని­ర్వ­హిం­చ­గా, ఆరో­ప­ణ­లు–ప్ర­త్యా­రో­ప­ణ­ల­తో రా­జ­కీయ వా­తా­వ­ర­ణం మరింత వే­డె­క్కిం­ది. చి­వ­రి రోజు జరి­గిన ప్ర­చా­రం­లో నేతల మా­ట­లు తీ­వ్ర స్థా­యి­లో ఉం­డ­టం­తో, ఓట­ర్లు ఎవరి వా­ద­న­ల­కు మద్ద­తు ఇస్తా­ర­న్న ఉత్కంఠ నె­ల­కొం­ది. భూ­పా­ల­ప­ల్లి­లో జరి­గిన ప్ర­చార సభలో కే­టీ­ఆ­ర్, ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి­పై ఘాటు వ్యా­ఖ్య­లు చే­శా­రు. గతం­లో కే­సీ­ఆ­ర్‌­పై వి­మ­ర్శ­లు చే­సిన వా­రి­ని వది­లి­పె­ట్ట­బో­మ­ని హె­చ్చ­రిం­చా­రు. భూ­పా­ల­ప­ల్లి జి­ల్లా­కు సం­బం­ధిం­చి సీఎం వ్యా­ఖ్య­ల­పై కూడా ఆయన తీ­వ్రం­గా స్పం­దిం­చా­రు. ఈ వ్యా­ఖ్య­లు రా­జ­కీ­యం­గా చర్చ­నీ­యాం­శం­గా మా­రా­యి. ఇక రా­మ­యం­పే­ట­లో జరి­గిన సభలో మాజీ మం­త్రి హరీ­శ్ రావు మా­ట్లా­డు­తూ, కొం­త­మం­ది పో­లీ­సు­లు హద్దు­లు దా­టు­తు­న్నా­ర­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. రెం­డే­ళ్ల తర్వాత బీ­ఆ­ర్ఎ­స్ మళ్లీ అధి­కా­రం­లో­కి వస్తుం­ద­ని, తానే మం­త్రి­గా ఉం­టా­న­ని ధీమా వ్య­క్తం చే­శా­రు. ఈ వ్యా­ఖ్య­లు అధి­కార వర్గా­ల్లో చర్చ­కు దా­రి­తీ­శా­యి. కే­టీ­ఆ­ర్ వ్యా­ఖ్య­ల­కు కాం­గ్రె­స్ పా­ర్టీ కూడా అదే స్థా­యి­లో స్పం­దిం­చిం­ది. కాం­గ్రె­స్ ఎమ్మె­ల్యే నా­యి­ని రా­జేం­ద­ర్ తీ­వ్ర పద­జా­లం­తో కౌం­ట­ర్ ఇచ్చా­రు. కే­టీ­ఆ­ర్ వ్యా­ఖ్య­లు అన­వ­స­ర­మ­ని మం­డి­ప­డ్డా­రు. అదే సమ­యం­లో కాం­గ్రె­స్ నేత సా­మ­రా­మ్మో­హ­న్ రె­డ్డి కూడా కే­టీ­ఆ­ర్‌­పై తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­స్తూ రా­జ­కీయ వేడి పెం­చా­రు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News