MUNCIPAL POLLS: సత్తా చాటాలని కాంగ్రెస్..ఉనికి చాటాలని బీఆర్ఎస్
అధికారం చేపట్టాక పార్టీ గుర్తుపై ఎన్నికలు... గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్... సత్తా చాటాలని చూస్తున్న విపక్షాలు
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. 100కు పైగా మున్సిపాల్టీలు, 7 కార్పోరేషన్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది.అందుకోసం మంత్రులకు ఎన్నికల స్ట్రాటజీపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఉత్తర తెలంగాణ లో బలంగా ఉన్న బీజేపీ పార్టీ ఈసారి నిజామాబాద్,కరీంనగర్ కార్పోరేషన్ల తో పాటు 10 మున్సిపాల్టీలో విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నది. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకునేందుకు మున్సిపాల్టీలకంటే ఓటు శాతంపై ఫోకస్ పెట్టింది.
కాంగ్రెస్కు తొలి పరీక్ష..
అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ గుర్తులతో జరుగుతోన్న తొలి ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ లీడర్లు చాలెంజ్ గా తీసుకుంటున్నారు. మెజార్టీ అర్బన్ బాడీల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. లేకపోతే అటు పార్టీ, ఇటు ప్రభుత్వంపై పరువు పోతుందనే టెన్షన్ పట్టుకున్నది. అందుకే ఒక్కో లోకసభ నియోజవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ చార్జిగా నియమించారు. ఆ ఏరియాల్లోని మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో పార్టీ గెలుపుఓటముల బాధ్యతలను సదరు మంత్రులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు అప్పగించారు.
ఎన్నికల్లో అనుచరించాల్సిన వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వివరిస్తూ, క్షేత్ర స్థాయిలో పార్టీకి సానుకూల వాతవరణం ఉందని పలు సర్వేల నివేధికలను మంత్రులకు అందించారు. అందుకని ఎన్నికలు ముగిసే వరకు సంబంధిత లోకసభ పరిధిలో ఉంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారుు. ప్రస్తుతం 116 మున్సిపాల్టీలు,7 కార్పోరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో కనీసం 100 పైగా మున్సిపాల్టీల్లో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు కావాల్సిన కార్పొరేటర్లను గెలిపించుకోవాలని టార్గెట్ పెట్టకున్నట్లు తెలిసింది. అలాగే ఎన్నికలు జరుగుతోన్న 7 కార్పోరేషన్లలో మేయర్ పదవిని కాంగ్రెస్ గెలుచుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ పార్టీ ఆ ఏరియాలో మెజార్టీ మున్సిపాల్టీలను సొంతం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నది. ప్రధానంగా నిజామాబాద్,కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లు, 10 మున్సిపాల్టీలను కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నది. అందుకోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కొన్ని రోజులుగా కరీంనగర్ లో ఉంటూ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం కొనసాగిస్తున్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ సైతం నిజామాబాద్ కార్పోరేషన్ లో విజయం సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు అదిలాబాద్ ఎంపీ నగేష్ సైతం నియోజకవర్గంలోఉంటూ గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.