Munugode: మునుగోడు ఉప ఎన్నిక.. మొదలైన పోలింగ్
Munugode: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం ఏడు గంటల ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతుంది.;
Munugode: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం ఏడు గంటల ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతుంది. మునుగోడులోని మొత్తం 298 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్‌ను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తోంది ఎన్నికల కమిషన్.. ఇందు కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల నుంచి ఫిర్యాదుల కోసం సి-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ సరళిని సీఈవో వికాస్ రాజ్ దగ్గరుంచి పరిశీలిస్తున్నారు.
నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది స్త్రీలు ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.అన్ని పోలింగ్ కేంద్రాలకు మొత్తంగా 2,500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటుండగా, అందులో 1,000మంది పోలీసులు ఉన్నారు. అదర్ పోలింగ్ ఆఫీసర్స్‌తో పాటు నియోజకవర్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ సిబ్బందికి తోడుగా 199 మంది మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తున్నారు...
ఇక పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఓటర్లు బారులు తీరారు.. తన స్వంత గ్రామం ఇడుకుడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిపాల్వాయి స్రవంతి. శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగాలని కోరుకుంటున్నానని, ప్రజలు ప్రశాంత వాతవరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు..
ఇక సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని తన స్వంత గ్రామం లింగవారి గూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఓటు తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.. మునుగోడు ఓటర్లు చైతన్యవంతులని ఈ ఉప ఎన్నికలో 90 నుంచి 95 శాతం ఓటింగ్ నమోదవుతుందని అన్నారు..
మరోవైపు మునుగోడు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను పరిశీలించారు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి.. సంస్ధాన్ నారయణపూర్‌లో ఇండిపెండెంట్ అభ్యర్ధి KA పాల్ హల్‌చల్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లోకి పరుగులు తీస్తూ వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి మళ్లీ పరుగులు పెడుతూ బయటికి వెళ్లి పోయారు.