నల్గొండ-ఖమ్మం-వరంగల్ MLC కౌంటింగ్.. పల్లాకి గట్టిపోటీ ఇచ్చిన మల్లన్న!
మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండవ రౌండ్ లెక్కింపులో రాజేశ్వర్‌రెడ్డికి 7,871 ఓట్ల ఆధిక్యం.;
*నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో TRS అభ్యర్థికి ఆధిక్యం
*తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 7,871 ఓట్ల ఆధిక్యం
*తొలిరౌండ్‌లో , 2వ రౌండ్‌లో 3787 ఓట్ల ఆధిక్యం
*TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 31,987 ఓట్లు.. తీన్మార్ మల్లన్నకు 24,116 ఓట్లు
*కోదండరామ్- 18,520, ప్రేమేందర్‌రెడ్డి-13,284, రాములు నాయక్- 7598
*బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్ని దాటి పల్లాకి గట్టిపోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న
నల్గొండ-వరంగల్-ఖమ్మం MLC స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో TRS అభ్యర్థి- సిట్టింగ్ MLC పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16 వేల 130ఓట్లు వస్తే.. తీన్మార్ మల్లన్నకు 12 వేల 46 ఓట్లు వచ్చాయి. TJS అధ్యక్షుడు కోదండరామ్‌కు 9 వేల 80 ఓట్లు వచ్చాయి. BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6 వేల 615 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 4 వేల 354 ఓట్లు పడ్డాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండవ రౌండ్ లెక్కింపులో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 7,871 ఓట్ల ఆధిక్యం. TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 31,987 ఓట్లు వస్తే.. తీన్మార్ మల్లన్నకు 24,116 ఓట్లు వచ్చాయి. కోదండరామ్- 18,520, ప్రేమేందర్‌రెడ్డి-13,284, రాములు నాయక్- 7598 వచ్చాయి. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్లలో 3వ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.