Akbaruddin Owaisi : ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఊరట.. !
Akbaruddin Owaisi : MIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌కు ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.;
Akbaruddin Owaisi : MIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌కు ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. గతంలో నిర్మల్, నిజామాబాద్‌లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగంపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. 2012లో విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ అక్బరుద్దీన్‌పై కేసులు నమోదయ్యాయి. భవిష్యత్‌లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కోర్టు సూచించింది. అటువంటి ప్రసంగాలు చేస్తే దేశ సమగ్రతకు మంచిది కాదని పేర్కొంది. కేసు కొట్టివేసినంతమాత్రాన సంబరాలు చేసుకోవద్దని సూచించింది కోర్టు.