తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. కరోనా బారిన పడిన నాయిని.. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కానీ..న్యూమోనియాతో తిరిగి ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో... ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. నాయిని మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాయని అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు.