Kishan Reddy: కేసీఆర్ నయా నిజాం: కిషన్‌రెడ్డి
కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: కిషన్‌రెడ్డి;
బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. తెలంగాణలో యుద్ధం మొదలైంది.. కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉమ్మడి ఏపీలోనూ నిర్బంధ పరస్థితులు తెలంగాణలో ఉన్నాయన్నారు. నియంత రాజ్యంలో ప్రజలు.. ప్రతిపక్షాలకు ఆందోళన చేసే స్వేచ్ఛ కూడా లేదన్నారు. ప్రశ్నిస్తే హక్కులను కాలరాస్తారా అని మండిపడ్డారు. సకల జనులు పోరాడితే కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఫాంహౌస్‌లో అరెస్ట్ చేయిస్తాం.. రోజులు లెక్కబెట్టుకోవాలంటూ హెచ్చరించారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో బీజేపీ ఎప్పుడూ కలవలేదు.. భవిష్యత్‌లోనూ కలవబోదన్నారు కిషన్‌రెడ్డి. మాట తప్పం.. మడమ తిప్పం.. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉదమ్యాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. బీజేపీపై విషం చిమ్ముతున్నారు.. తెలంగాణ ప్రజలకు అంతా తెలుసని అన్నారు.