Telugu Academy : తెలుగు అకాడమీ స్కామ్‌లో కొత్త మలుపు..!
Telugu Academy : మరోవైపు వెయ్యి కోట్ల టర్నోవర్ కూడా లేని అగ్రసేన్ బ్యాంక్‌కు 9 నెలల్లో 63 మూడు కోట్ల నగదును నిందితులకు సమకూర్చడం కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.;
Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బ్యాంకుల ద్వారా మస్తాన్ వలీ ముఠా మొత్తం 63 కోట్ల 47 కోట్లు సొసైటీ ఖాతాకు మళ్లించి, కాజేసిందని సీసీఎస్ పోలీసులు రిమాండ్ డైరీలో నమోదు చేయగా.. తెలుగు అకడామీ అధికారులు మాత్రం 55 కోట్లు మాత్రమే అంటోంది. దీంతో మిగిలిన ఎనిమిదిన్నర కోట్లు ఎవరివి అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. దీంతో అకాడమీ కాకుండా మరేదైనా ప్రైవేట్ సంస్థల ఫిక్సిడ్ డిపాజిట్లను కూడా మస్తాన్‌వలీ ముఠా దారి మళ్లించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వెయ్యి కోట్ల టర్నోవర్ కూడా లేని అగ్రసేన్ బ్యాంక్‌కు 9 నెలల్లో 63 మూడు కోట్ల నగదును నిందితులకు సమకూర్చడం కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల గల్లంతు వ్యవహారంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక డిపాజిట్ల పత్రాలు, లేఖలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు. మొత్తం నలుగురు నిందితులను 10 రోజల కస్టడీకి పోలీసులు కోరగా.. కస్టడీ పిటిషన్‌పై రేపు నాంపల్లి కోర్టు విచారించనుంది. తెలుగు అకాడమీ విభజన జరుగుతున్న సమయంలో ఈ కుంభకోణం జరగడంతో.. ఆప్రక్రియ కొన్నాళ్లు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది.