భువనగిరి-వరంగల్ హైవే ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్ నగర జిల్లా ఆరేపల్లి వరకు రూ.1,905 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి నెంబరు 163ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.;
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్ నగర జిల్లా ఆరేపల్లి వరకు రూ.1,905 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి 163ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. మరికొన్ని రహదారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, సీఎం కేసీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి నెంబరు163తో పాటు 13 వేల 169 కోట్ల రూపాయలతో 766కి.మీ మేర రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొత్తం 14 రహదారుల్లో 6 ప్రాజెక్టులను గడ్కరీ జాతికి అంకితం చేయగా మరో 8 నూతన రహదారులకు భూమి పూజ చేశారు.