Nizamabad VC Dance : అర్థరాత్రి విద్యార్ధినులతో కలిసి చిందేసిన వైస్ చాన్స్‌లర్..
Nizamabad VC Dance : వినాయక నిమజ్జనం సందర్భంగా గర్ల్స్ హాస్టల్‌కు వెళ్లి మరీ చిందులేశారు తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్;
Nizamabad VC Dance : వినాయక నిమజ్జనం సందర్భంగా గర్ల్స్ హాస్టల్‌కు వెళ్లి మరీ చిందులేశారు తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్. నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులు.. గేట్ పెట్టుకుని నిద్రపోయారు. అయితే గర్ల్స్ హాస్టల్ గేట్ ఓపెన్ చేయించి మరీ లోపలికి వెళ్లారు వీసీ రవీందర్. వైస్ ఛాన్సెలర్‌తో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కూడా లేడీస్ హాస్టల్‌కు వెళ్లారు.
అక్కడి వెళ్లి విద్యార్థినులతో డ్యాన్సులు చేయడమే కాకుండా.. డబ్బులు కూడా పంచారు. వీసీ రవీందర్ వ్యవహార శైలిపై విద్యార్ధి సంఘాలు ఫైర్ అవుతున్నాయి. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లోకి ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ.. వీసీ ఎలా వెళ్తారంటూ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వీసీ రవీందర్‌కు డ్యాన్స్ చేయాలనుంటే.. బాయ్స్ హాస్టల్‌కు వెళ్లాలి గాని, గేట్ ఓపెన్ చేయించి మరీ రాత్రి పూట గర్ల్స్ హాస్టల్‌కు వెళ్లడమేంటని మండిపడుతున్నారు.