Telangana Schools: తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెనింగ్‌‌ అప్పుడేనా..?

Telangana Schools: జనవరి 31న విద్యాసంస్థల రీఓపెనింగ్ ఉంటుంది అనుకున్నారంతా.

Update: 2022-01-29 09:52 GMT

Telangana Schools: కోవిడ్ వ్యాప్తి మునుపటి కంటే చాలా వేగంగా ఉంది. అయినా అన్ని విభాగాలు యథావిధిగా ఎవరి పని వారు చూసుకుంటున్నాయి. కానీ విద్యాసంస్ధలను తెరిచి పిల్లలను మాత్రం రిస్క్‌లో పడేయకూడదని ప్రభుత్వం అనుకుంటోంది. దీనిపై భిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ తెలంగాణలో విద్యాసంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయి.?

చాలారోజులు ఆన్‌లైన్‌లోనే పిల్లలకు క్లాస్‌లను నడిపించిన తర్వాత ఎట్టకేలకు పిల్లలకు ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా స్కూళ్లు ప్రారంభమయిన కొన్నిరోజులకే ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగిపోయింది. దీంతో సంక్రాంతి సెలవులను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 30 వరకు తెలంగాణలో విద్యాసంస్థలు అన్నింటికి సంక్రాంతి సెలవులు అని ప్రకటించింది. ఇప్పుడు రీఓపెనింగ్ ఎప్పుడు అవుతుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.

జనవరి 31న విద్యాసంస్థల రీఓపెనింగ్ ఉంటుంది అనుకున్నారంతా. కానీ కరోనా వ్యాప్తి ఎక్కవుగా ఉండడం వల్ల ఇంకా దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టులో స్పష్టం చేశారు. త్వరలోనే విద్యాసంస్థల రీఓపెనింగ్ ఎప్పుడు ఉంటుందో స్పష్టం చేస్తామని కూడా తెలిపారు. ఫిబ్రవరీ 1న రీఓపెనింగ్ ఉంటుందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే విద్యార్థులకు మళ్లీ ఆన్‌లైన్ క్లాసులు తప్పవేమో అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.

Tags:    

Similar News