Telangana: హైదరాబాద్‌లో వర్షధారాపాతం

నగరవాసిని భయపెడుతున్న ఎడతెరిపిలేని వానలు; నాలుగు రోజులుగా నాన్‌ స్టాప్‌ వర్షం

Update: 2023-07-20 06:54 GMT

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షధారాపాతం నగరవాసిని భయపెడుతోంది. నాలుగు రోజులుగా నాన్‌ స్టాప్‌ వర్షంతో సిటీజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ జలమయం కావడంతో.. ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు. లిగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జ్‌ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఈ దారిగుండా వెళ్లాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. వర్షపు నీరు అంచనా వేయకుండా ముందుకు వెళ్లడంతో.. ఆ నీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. కారు డ్రైవర్‌ కేకలు విన్న స్థానికులు.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వర్షపు నీటి నుంచి కారు డ్రైవర్‌ను కాపాడారు.

భారీ వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబర్‌పేట్, చిక్కడపల్లి, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. పటేల్‌నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోని మోకాలిలోతు వరకు నీళ్లు చేరాయి.

బేగంపేట్‌, పారడైజ్, సికింద్రాబాద్‌ స్టేషన్, మోండా మార్కెట్, జనరల్‌ బజార్, సీతాఫల్‌మండి, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది.


Tags:    

Similar News