Telangana ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

అక్టోబరు 14తో ముగుస్తున్న దరఖాస్తు గడువు;

Update: 2024-10-12 03:15 GMT

వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 14 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువుగా బోర్డు నిర్ణయించింది. నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుంది. కాగా పోస్టుల్లో 272 నర్సింగ్‌ ఆఫీసర్లు, 99 స్టాఫ్‌ ఫార్మాసిస్ట్‌ పోస్టులున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 272 నర్సింగ్‌ ఆఫీసర్ పోస్టులు, 99 స్టాఫ్‌ ఫార్మాసిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. కాగా గత నెలలో 2,050 నర్సింగ్‌ పోస్టులకు వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ 2050 పోస్టుల‌కు అద‌నంగా తాజాగా 272 పోస్టుల‌తో అనుబంధ నోటిఫికేష‌న్ జారీ చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 2,322కు చేరింది. ఇక ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది కూడా. అక్టోబర్‌ 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష జరగనుంది. ఎంపికైన వారికి నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు జీతంగా చెల్లిస్తారు. రాతపరీక్షకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ కేటాయిస్తారు. మొత్తం వంద మార్కులకు నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

టీజీపీఎస్సీ ఏఎంవీఐ ఎంపిక జాబితా వెల్లడి

తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖలో 113 సహాయ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టులకు సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఎంపిక జాబితా వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ అభ్యర్ధులకు సూచించారు.

Tags:    

Similar News