Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో నవ వధువు ఆత్మహత్య.. అప్పగింతల సమయంలో..
Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది.;
Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లిని అంగీకరించలేని నవ వధువు అప్పగింతలకు ముందు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. జిల్లా కేంద్రంలోని పాతతోట ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే యువతికి.. అనంతపూర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో నిన్న ఉదయం వివాహం జరిగింది.
పెళ్లిలో ఎంతో హుషారుగా కనిపించిన లక్ష్మి.. సాయంత్రం పేళ్ల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్పృహ కోల్పోయిన పడిపోయిన లక్ష్మిని బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటి వరకు కళకళలాడిన ఇంట్లో విషాదం అలముకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.