Karimnagar: పేలిన మరో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టగానే..
Karimnagar: దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ బైకులు పేలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.;
Karimnagar: దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ బైకులు పేలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. గ్రామానికి చెందిన ఎగుర్ల ఓదేలు ఎలక్ట్రిక్ బైక్‌కు చార్జింగ్ పెట్టగా.. కాసేపటికే బ్యాటరీ పేలిపోయి బైక్ కాలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. బెన్లింగ్ ఫాల్కన్‌కు చెందిన ఈ బైక్‌ను 10 నెలల క్రితం కొనుగోలు చేసినట్లు బాధితుడు తెలిపాడు.