Pragathi Bhavan: ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత.. పలువురు విద్యార్థుల అరెస్ట్..

Pragathi Bhavan: హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Update: 2022-05-05 09:30 GMT

Pragathi Bhavan: హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రగతిభవన్‌ ముట్టడికి ఓయూ జేఏసీ నాయకులు ప్రయత్నించారు. విద్యార్థులతో రాహుల్‌ గాంధీ ముఖాముఖీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు, విద్యార్థి సంఘం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags:    

Similar News