Google Search : ప్రధాని మోదీని దాటేసిన పవన్

సినీ, రాజకీయ వర్గాల్లో నెంబర్ వన్..;

Update: 2024-12-11 05:15 GMT

2024లో భారతీయులు ఎక్కువగా వెతికిన అంశాల జాబితాను గూగుల్‌ వెల్లడించింది. ఇందులో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అగ్రస్థానంలో నిలవగా.. వ్యక్తుల జాబితాలో పవన్‌ కళ్యాణ్‌ ఐదో స్థానంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ప్రధాని మోడీ ప్రశంసలు.. పవన్ ను గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో 5వ స్థానంలో నిలిచేలా చేశాయి. ‘యే పవన్ నహీ ఆంధీ హై’ అంటూ మోదీ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి. తన స్టామినా ఏంటో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా చూపించాడు. నార్త్ ఆడియెన్స్ లో పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ వచ్చింది. మరి దీనితో పవన్ క్రేజ్ లోకల్ నుంచి నేషనల్ వరకు వెళ్లిందని అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇపుడు దీనికి మించిన కిక్ తో పవన్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఈసారి పవన్ నేషనల్ లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యారు. గూగుల్ లో అత్యధిక శాతం మంది మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించే సెర్చ్ చేశారట.

సినీ, రాజకీయ వర్గాల్లో నెంబర్ వన్..

2024లో గూగుల్ లో అత్యధిక శాతం మంది మన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించే సెర్చ్ చేశారట. సినిమా, రాజకీయ వర్గాలను కలిపి చూస్తే, గూగుల్ ట్రెండ్స్‌లో పవన్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. పవన్ చరిత్ర తెలుసుకోవడం కోసం దేశం నలుమూలల నుంచి అందరూ పవన్ కళ్యాణ్ గురించి గూగుల్ లో సెర్చ్ చేశారు. హీరోలు, రాజకీయ నాయకుల కేటగిరీలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో, చిరాగ్ పాశ్వాన్ రెండో స్థానంలో, నరేంద్ర మోడీ మూడో స్థానంలో, చంద్రబాబు నాలుగో స్థానంలో నిలిచారు.

Tags:    

Similar News