BRS: గులాబీ పార్టీకి మళ్లీ గుర్తుల గుబులు
జూబ్లీహిల్స్ బై పోల్‌లో గుర్తుల కేటాయింపు.. స్వతంత్ర్య అభ్యర్థులకు సింబల్స్ ఇచ్చిన ఈసీ.. అభ్యర్థులకు కారు గుర్తును పోలిన గుర్తులు ##
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తాజాగా అభ్యర్థులకు ఈసీ సింబల్స్ కేటాయించింది. ఎన్నికల సింబల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్ ఉండటంతో ఆ పార్టీ తలలు పట్టుకుంటుంది. . వందల సంఖ్యలో నామినేషన్లు వేసినప్పటికీ అందరూ ఉపసంహరించుకోవడంతో బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా అభ్యర్థులకు తాజాగా ఈసీ ఎన్నికల సింబల్స్ కేటాయించింది. దీంతో అభ్యర్థులంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదంతా బాగనే ఉన్నప్పటికీ తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ గుర్తుల టెన్షన్ తప్పేలా లేదు. తాజాగా అభ్యర్థులకు ఈసీ ప్రకటించిన ఎన్నికల సింబల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్ ఉండటంతో ఆ పార్టీ తలలు పట్టుకుంటుంది.
గతంలోనూ తిప్పలు
తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్కు.. గతంలో మాదిరిగానే ఈ ఉప ఎన్నికలోనూ గుర్తుల టెన్షన్ తప్పేలా లేదు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన సింబల్స్ పలు స్వతంత్ర అభ్యర్థులకు, చిన్న పార్టీలకు కేటాయించడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ముఖ్యంగా రోడ్ రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులు తమ ఓట్లను గల్లంతు చేస్తాయనే భయం బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది.గతంలో జరిగిన చాలా ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్ కారణంగా వృద్ధ ఓటర్లు, దృష్టిలోపం ఉన్నవారు తికమకపడి తప్పుడు గుర్తుకు ఓటు వేశారని, దానివల్ల తమకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రోడ్ రోలర్, చపాతీ మేకర్, సోప్ బాక్స్, కెమెరా వంటి సింబల్స్‌ను రద్దు చేయాలని గతంలో ఈసీకి విజ్ఞప్తి కూడా చేశారు. కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాజాగా కేటాయించిన గుర్తుల్లో మళ్లీ అవే సింబల్స్ కనిపించడంతో బీఆర్ఎస్ టెన్షన్ రెట్టింపైంది. బ్యాలెట్ పేపర్లో గుర్తుల స్థానాలను పరిశీలిస్తే... బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి (కమలం) మొదటి స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు (హస్తం) రెండో స్థానం, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు (కారు) మూడో స్థానం కేటాయించారు. అయితే ఇదే ఈవీఎం యూనిట్లో కారు గుర్తుకు దగ్గరగా ఉండే ఇతర సింబల్స్ ఉన్నాయి. 5వ నంబర్లో సోప్ డిష్, 9వ నంబర్లో చపాతీ రోలర్, 13వ నంబర్లో రోడ్ రోలర్, 21వ నంబర్లో కెమెరా వంటి గుర్తులు ఉన్నాయి. సాధారణంగా ఒక బ్యాలెట్ యూనిట్‌పై నోటాతో సహా 16 పేర్లు ఉంటాయి. అంటే, మొదటి ఈవీఎం యూనిట్లోనే బీఆర్ఎస్ కారు గుర్తుతో పాటు దాన్ని పోలిన గుర్తులు ఉండటం వలన ఓటర్ల గందరగోళం పెరిగే అవకాశం ఉంది. ఈ గుర్తుల గండం నుంచి బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో ఎలా బయటపడుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ కు కొత్త టెన్షన్
ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తులు గుబులు పుట్టి స్తున్నాయి. తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులు పలు పార్టీలు, స్వతంత్ర అభ్య ర్థులకు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో మాత్రం తెగ టెన్షన్ పడుతోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ గులాబీ దళంలో ఇదే భయం కనిపిస్తోం ది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న రిజిస్టర్ పార్టీల, స్వతంత్ర అభ్యర్ధులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. గతంలో ఈ సింబల్స్ తొలగించాలని ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. కారు గుర్తుకు దగ్గరగా ఉండటంతో సింబల్స్ గుర్తింపులో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నా రని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్ని కల సంఘానికి ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఇప్పటికే ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఎలక్షన్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా ఈసీ ప్రకటించింది. మొత్తం 211 మంది నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో మొత్తం 23 మంది నామినేషన్లను విశ్రా చేసుకోగా.. 58 మంది బరిలో నిలిచారు. అయితే, ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. స్వతంత్రులు, విద్యార్థి నాయకులు, రైతులు బరిలోకి దిగారు.