రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన..
SC Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే..;
Railway Platform
SC Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. కరోనా వైరస్ విజృంభణ సమయంలో పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు తగ్గిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం, సౌలభ్యం కోసం ప్లాట్ ఫాం ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.50 గా చేశారు. అయితే సికింద్రాబాద్ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారం టికెట్ ధరలను తగ్గిస్తూ ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. తాజాగా అన్‌రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్, సాధరణ రైళ్లను పునరుద్ధరించారు. రైల్వే స్టేషన్లల్లో ప్లాట్‌ఫారం టికెట్ ధర రూ.10 ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం ప్లాట్‌ఫారం ధర రూ. 20 ఉంటుందని అధికారులు వెల్లడించారు.