తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల భార్యలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు కానిస్టేబుల్ భార్యలు సచివాలయాన్ని ముట్టడించారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అది అమలు అయ్యేవరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిక్రూట్‌మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారని... బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల తమవారు కుటుంబాలకు దూరమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల భార్యలు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా బందోబస్తు పెంచారు.