తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఇంకా మార్చి కూడా రాకుండానే అప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ విభాగం కూడా ప్రకటించింది. ఇప్పటికే మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోతతో తడిసిపోతున్నారు. దీంతి విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. మొన్నటి దాకా 16వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ ఇప్పడు 16,506 మెగావాట్లకు పెరిగిందని విద్యుత్తు అధికారులు ప్రకటించారు. విద్యుత్ బిల్లులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఒక్క ఇంటికి సగటున రూ.500 వరకు మాత్రమే వచ్చే విద్యుత్ బిల్లులు ఇప్పడు తడిసి మోపెడవుతున్నాయి. ఈ వేసవిలోనే విద్యుత్ డిమాండ్ 17వేల మెగావాట్లకు దాటవచ్చని విద్యుత్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వ్యవసాయ పరంగా పలు జిల్లాల్లో కరెంటు కోతలు మొదలయ్యాయి. విద్యుతుల సరఫరాలో అంతరాయం లేకుండా ట్రాన్స్కో ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు.