TS: కోటీ 20 లక్షలకుపైగా అభయ హస్తం దరఖాస్తులు
ముగిసిన తుది గడువు... కార్యాచరణ ప్రకటించనున్న తెలంగాణ ప్రభుత్వం;
తెలంగాణలో అయిదు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోని అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఏమినిది రోజులు నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో కోటి 20 లక్షలకుపైనే దరఖాస్తులు వచ్చాయి. చివరిరోజున పలుచోట్ల మంత్రులు స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ప్రజాపాలనకు హాజరైన సీతక్క సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సిద్దిపేట జిల్లా హూస్నాబాద్ లో నిర్వహించిన ప్రజాపాలనలో..... మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన మంత్రి...అసలైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలోని బతుకమ్మ కుంట, ఇందిరానగర్ కాలనీల్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పుట్టగూడెం, కొండేటి చెరువు గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు... బిచ్కుంద మండలం రాజారాం తండాలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలన తెచ్చామన్న మంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ..మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన మంత్రి....త్వరలోనే సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు పర్యవేక్షించారు. ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం దరఖాస్తులు సమర్పించని వారు...ఆందోళన చెందొద్దని... ప్రతీ నాలుగు నెలలకోసారి ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజాపాలనలో పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా... మధిర నియోజక వర్గం బనిగండ్లపాడులో నిర్వహించిన.ప్రజాపాలనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభయహస్తం దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. ఇప్పటివరకు...... దరఖాస్తు ఇవ్వని వారు ఆందోళన చెందవద్దదని.... ప్రతీ నాలుగు నెలలకోసారి ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చారు.