అల్లూరి సీతారామరాజు పోరాటం.. దేశభక్తి అసామానమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. అల్లూరి ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో ఆంగ్లేయులపై పోరాటం చేశారన్నారు. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలని అన్నారు.
బ్రిటీష్ బంధనాల నుంచి భారత మాత విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని అన్నారు. అల్లూరి గొప్పతనాన్ని.. చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అల్లూరి పోరాటం మరువలేనిదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. గిరిజనుల స్వాతంత్ర్యం, సంస్కృతిని కాపాడేందుకు ఆయన పోరాటం చేశారన్నారు. అల్లూరి ఒక వర్గానికే పరిమితమైన వ్యక్తి కాదని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. సూర్యచంద్రులు ఉన్నంతవరకు విస్మరించలేని క్షత్రియ వీరుడు అల్లూరి అని కొనియాడారు.