Bandi Sanjay: జనవరి 2న బండి సంజయ్ అరెస్టు, దాడిపై ప్రివిలేజ్ కమిటీ విచారణ..
Bandi Sanjay: గతనెలలో బండి సంజయ్ అరెస్టు, ఆయన ఆఫీసు మీద దాడి ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది.;
Bandi Sanjay (tv5news.in)
Bandi Sanjay: గతనెలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు, ఆయన ఆఫీసు మీద దాడి ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. కరీంనగర్ సీపీ సత్యనారాయణతో పాటు ఇతర పోలీసు అధికారులు కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి విచారణకు హాజరు కాలేదు. దాదాపు రెండున్నర గంటలపాటు ప్రివిలేజ్ కమిటీ విచారణ సాగింది. బండి సంజయ్ ఫిర్యాదులోని అంశాలపై అధికారుల్ని విచారించారు కమిటీ సభ్యులు. ఇక ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసు అధికారులు కమిటీకి అందజేశారు.
గతనెల 2న బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. 317జీవోను సవరించాలంటూ కరీంనగర్‌లోని ఆయన కార్యాలయంలో దీక్షకు కూర్చున్న సంజయ్‌ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆఫీసుపై దాడి చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో బండి సంజయ్ అరెస్టు, పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతనెల 21న తెలంగాణ సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ సీఐకి నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు.