బన్నీ ఫ్యాన్స్‌‌‌కి గుడ్ న్యూస్.. తెలంగాణలో అయిదు షోలు.. ఎప్పటివరకు అంటే.. ?

ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప మానియానే కనిపిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌‌లో వస్తోన్న ఈ సినిమా రేపు(డిసెంబర్ 17)న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Update: 2021-12-16 10:42 GMT

Pushpa Movie : ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప మానియానే కనిపిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌‌లో వస్తోన్న ఈ సినిమా రేపు(డిసెంబర్ 17)న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్, పాటలు సినిమాకి మంచి క్రేజ్‌‌‌ను తీసుకోచ్చాయి. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అయితే తెలంగాణలో ఈ షోకి అయిదు షోలు వేయనున్నారు. ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 30 వరకు పుష్ప సినిమా అయిదు షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీనితో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన పుష్ప సినిమాను మైత్రమూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ ప్రధానపాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. 

Tags:    

Similar News