రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Update: 2020-10-11 11:14 GMT

రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళ వారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి... పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ కోరారు.

Tags:    

Similar News