Komatireddy Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ టూర్ అందుకేనా..?
Komatireddy Rajagopal Reddy : బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.;
Komatireddy Rajagopal Reddy : బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఇందుకోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని బీజేపీ ముఖ్యనేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశం అవుతారని అనుచరులు చెబుతున్నారు. మునుగోడులో బహిరంగ సభ ఏర్పాటు చేసి.. అదే వేదికగా బీజేపీలో చేరతానని రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదన పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
వచ్చే 8వ తేదీన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు. మరోవైపు.. మునుగోడులో జరిగే కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి వెళ్లొద్దని క్యాడర్‌కు రాజగోపాల్ రెడ్డి ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ముఖ్యనేతలను హైదరాబాద్ పిలిపించుకుని మరీ రాజగోపాల్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నట్టు అనుచరవర్గం చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి క్యాడర్ రాకుండా.. రాజగోపాల్‌రెడ్డి డబ్బులతో ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.