RATION CARDS: కొత్త రేషన్‌కార్డుల జారీపై కీలక ప్రకటన
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై అప్డేట్... నిరంతరాయంగా కార్డుల జారీ ప్రక్రియ
సంక్షేమ పథకాల తలుపులు తెరుచుకునే ‘కీ’గా మారిన రేషన్ కార్డుల జారీకి తెలంగాణలో మళ్లీ వేగం వచ్చింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమైన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ తాజాగా స్పష్టం చేసింది. గతంలో ఏళ్ల తరబడి కొత్త కార్డులు జారీ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది కుటుంబాలకు ఇప్పుడు ఊరట లభిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘ప్రజా పాలన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. పరిశీలన అనంతరం కొత్త కార్డులను జారీ చేయడం ప్రారంభించింది.
తాజాగా పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని తెలిపారు. ఇంకా కార్డులు పొందని అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు జోడించాల్సిన అవసరం ఉన్నవారికి కూడా సదుపాయం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. పేర్ల చేర్పు, కుటుంబ విభజన, చిరునామా మార్పులు వంటి అంశాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇంకా దరఖాస్తు చేయని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది చెప్పారు. ఇంకా కార్డులు రాని వారు మీ సేవ కేంద్రాల్లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు. దాంతో పాటుగా.. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జోడించే ప్రక్రియ సైతం నిరంతరాయంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులు, లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. 2026 జనవరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రేషన్‌కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరిందని తెలిపారు. లబ్ధిదారుల సంఖ్య 3,35,96,875కు పెరిగినట్లు సివిల్ సప్లయ్ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన ఏడాదిలోనే ఏకంగా 14.40 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 89,95,282 ఉందని చెప్పారు. ఇందులో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు(NFSC) 54,66,844. ఫుడ్ సెక్యూరిటీ కార్డుల(SFSC) సంఖ్య 35,28,438గా ఉందన్నారు. ప్రభుత్వం 14,40,566 కొత్త కార్డులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.