RAVAN DAHAN: ఘనంగా రావణ దహనం

తెలుగు రాష్ట్రాల్లో రావణ దహనం... పాల్గొన్న రాజకీయ ప్రముఖులు

Update: 2023-10-24 00:15 GMT

తెలంగాణ వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. శమీ వృక్షానికి పూజలు చేసి జమ్మి పంచుకొని, అలాయ్‌ బలాయ్‌ తీసుకుని రావణ దహనాలను కోలాహలంగా నిర్వహించారు. హైదరాబాద్‌ అంబర్‌పేట దేవస్థాన సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, స్థానిక MLA కాలేరు వెంకటేశ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత V హనుమంతరావు పాల్గొని రావన దహనాన్ని వీక్షించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రావణ దహనం కార్యక్రమాన్ని వీక్షించారు. షేక్‌పేట గుట్ట పోచమ్మ మైదానంలో బాణాసంచా వెలుగుల మధ్య రావణదహనం చేశారు. సికింద్రాబాద్‌ ఆల్వాల్‌లోని HMT ఆఫీసర్స్‌ కాలనీలో 36 అడుగుల భారీ రావణాసురుని విగ్రహాన్ని కాల్చారు. పరకాల, నర్సంపేట పట్టణాలలో రావణాసుర దహన కార్యాక్రమాలు ఘనంగా జరిగాయి.


ఆంధ్రప్రదేశ్‌లోనూ దేవి శరన్నవారాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా పి గన్నవరం మండలం తాటికాయలవారి పాలెంలో దుర్గాదేవి ఆలయంలో సెమీ పూజ అత్యంత వైభవంగా సాగింది.రావులపాలెం మండలం ఈతకోటలో అమ్మవారిని వివిధ కూరగాయలు,నగదుతో అలంకరించారు.కాట్రోనికోన మండలం కందిపప్పలో మహిళలు కనకదుర్గమ్మకు సారెను సమర్పించారు. దెందులూరు మండలం సింగవరంలో విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భవాని మాలదారులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు . విజయనగరం బొబ్బిలిలో మాజీ మంత్రి విజయకృష్ణ,బేబీ నాయన కోటలోని కత్తులు,బళ్లాలకు ఆయుధపూజ నిర్వహించారు .కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో రావణ దహన వేడుక జరిగింది. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఊరేగించి పూజలు నిర్వహించారు.


నెల్లూరు లో రాజరాజేశ్వరీ,ఇరుకళల పరమేశ్వహీ,కన్యకాపరమేశ్వరీ , జొన్నవాడ ఆలయల్లో అమ్మవారు మహిషాసుర మర్ధిని రూపంలో భక్తలకు దర్శనమిచ్చారు . లక్ష కుంకుమ పూజలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రాజస్థానీ మార్వాడీలు దుర్గామాతకు విశేష పూజలు చేశారు.అనంతరం భక్తి పాటలతో దాండియా నృత్యాలు చేశారు.శ్రీసత్యసాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి తిరువీధుల మీదగా గ్రామోత్సవం నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పార్వేటి ఉత్సవం వైభవంగా జరిగింది.స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు.ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న అన్ని దేవాలయాలనుంచి దేవతామూర్తులను తీసుకువచ్చి కొత్తపేటలోని జమ్మిచెట్టు వద్ద పూజలు నిర్వహించారు.

Similar News