REVANTH: 'రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర'
రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న రేవంత్
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ఓట్ చోర్-గద్దీ ఛోడ్’ పేరు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా చేపట్టింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘మహాత్మా గాంధీ, అంబేడ్కర్ రాజ్యాంగ రచన సమయంలో… రాజ్యాంగ సభలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కు విషయమై చర్చిస్తున్నప్పుడు ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎం.ఎస్ గోల్వాల్కర్ తదితరులు వారికి ఓటు హక్కు ఇవ్వొద్దన్నారు. కానీ.. గాంధీ, అంబేడ్కర్ వారికి ఓటు హక్కు కల్పించినందున ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పాటులో వాళ్లు కూడా భాగస్వాములవుతున్నారు. ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ భావజాలంతో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి భావజాలాన్ని అమలు చేసేందుకు 400 సీట్లు కావాలని కోరుకున్నారు. భాజపాకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు ఆ పార్టీని 240 సీట్లకు పరిమితం చేశారు.
'నేను కేబినెట్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు..'
రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డీసీసీ పదవుల్లో బీసీలకు పార్టీలో ప్రాధాన్యం పెరిగిందన్నారు. తాను కేబినెట్‌లోకి వెళ్లనని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని తెలిపారు.