REVANTH: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఇది దేశంపైనే దాడిగా అభివర్ణన
హర్యానా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన సీఎం రేవంత్, ఒక ఐపీఎస్ అధికారి కూడా కుల వివక్షకు గురై ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, సమాజంలో కుల ఆధారిత ద్వేషం ఎంత పెరిగిందో చూపిస్తున్న దారుణ ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏడీజీపీ స్థాయి అధికారి కూడా వేధింపులకు గురైతే, సాధారణ ప్రజల పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థమవుతుందని సీఎం తెలిపారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో విషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, ఇవి రాజ్యాంగం, సమానత్వం, న్యాయంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా బలమైన సామాజిక చైతన్యం అవసరమని వివరించారు. అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను అందరూ తీవ్రంగా ఖండించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇది దేశంపైనే దాడి
‘ఇది కేవలం ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్‌పై దాడి కాదు.. దేశంపైనే దాడి.. ఇలాంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వై. పూరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ‘వ్యక్తి సామాన్యుడైనా, ఉన్నతస్థాయి అధికారి అయినా, దళిత వర్గానికి చెందిన వారైనా, అన్యాయం, అమానవీయత ఏ రూపంలోనైనా సహించరాదు’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఏడీజీపీ స్థాయి అధికారిపై కూడా వేధింపులకు గురి కావడం తనను దిగ్భ్రాంతి గురిచేసిందని రేవంత్ అన్నారు. ఉన్నతస్థాయి అధికారికే గౌరవం లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని నిలదీశారు. కుల కల్లోలం నుంచి బయడపడపకపోతే.. ఈ విషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, ఇవి రాజ్యాంగం, సమానత్వం, న్యాయంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
గాంధీభవన్‌లో పోస్టర్లు కలకలం
స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. దివంగత నేత, టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డికి సూర్యపేట నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని కోరుతూ గాంధీభవన్‌లో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీకి దామన్న చాలా చేశారని, ఇప్పుడు పార్టీ దామన్నకు చేయాల్సిన సమయం వచ్చిందంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. సర్వోత్తమ్ రెడ్డిని పార్టీ ఇంచార్జీగా బాధ్యతలు ఇవ్వాలని కోరారు. స్థానిక ఎన్నికల వేళ ఈ పోస్టర్లు కలకలం రేపాయి.