REVANTH: తెలంగాణకు రక్షణశాఖ భూములు ఇవ్వండి

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ... రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం సమావేశం.. రక్షణశాఖ భూములు కేటాయించాలని విజ్ఞప్తి ##

Update: 2025-09-11 05:30 GMT

గాం­ధీ స‌­రో­వ­‌­ర్ ప్రా­జె­క్టు కోసం 98.20 ఎక­‌­రాల ర‌­క్ష­ణ­శాఖ భూ­ము­లు తె­లం­గాణ ప్ర­భు­త్వా­ని­కి బ‌­ద­‌­లా­యిం­చా­ల­‌­ని రక్ష­ణ­మం­త్రి రా­జ్‌­నా­థ్ సిం­గ్‌­ను ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి కో­రా­రు. ఢి­ల్లీ పర్య­ట­న­లో ఉన్న రే­వం­త్ రక్ష­ణ­మం­త్రి రా­జ్‌­నా­థ్ సిం­గ్‌­తో భేటీ అయ్యా­రు. ఈ సమా­వే­శం­లో రా­ష్ట్రా­ని­కి సం­బం­ధిం­చిన పలు కీలక అం­శా­ల­పై చర్చిం­చా­రు. ము­ఖ్యం­గా, తె­లం­గా­ణ­లో ట్రా­ఫి­క్ సమ­స్య­ల­ను పరి­ష్క­రిం­చేం­దు­కు అవ­స­ర­మైన రక్షణ శాఖ భూ­ము­ల­ను బద­లా­యిం­చా­ల­ని సీఎం రే­వం­త్ రె­డ్డి వి­జ్ఞ­ప్తి చే­శా­రు. హై­ద­రా­బా­ద్‌­లో­ని ట్రా­ఫి­క్ రద్దీ­ని తగ్గిం­చ­డా­ని­కి స్కై­వే­లు, ఎలి­వే­టె­డ్ కా­రి­డా­ర్ల ని­ర్మా­ణం అత్య­వ­స­రం అని ము­ఖ్య­మం­త్రి వి­వ­రిం­చా­రు. ఈ ప్రా­జె­క్టుల ని­ర్మా­ణా­ని­కి రక్షణ శాఖ ఆధీ­నం­లో ఉన్న భూ­ము­ల­ను రా­ష్ట్రా­ని­కి బది­లీ చే­యా­ల­ని కో­రా­రు. ము­ఖ్యం­గా, మె­హ­దీ­ప­ట్నం రై­తు­బ­జా­ర్ వద్ద స్కై వాక్ ని­ర్మా­ణా­ని­కి భూమి అవ­స­ర­మ­ని, దీ­ని­వ­ల్ల ప్ర­జ­ల­కు మె­రు­గైన సౌ­క­ర్యా­లు లభి­స్తా­య­ని చె­ప్పా­రు. మూసీ, ఈసీ న‌­దుల సం­గ­‌­మం స‌­మీ­పం­లో ‘గాం­ధీ స‌­ర్కి­ల్ ఆఫ్ యూ­ని­టీ’ ని­ర్మా­ణా­న్ని చే­ప­‌­ట్ట­ను­న్న­ట్లు తె­లి­పా­రు. జా­తీయ స‌­మై­క్యత, గాం­ధేయ వి­లు­వ­‌­ల­‌­కు సం­కే­తం­గా గాం­ధీ స‌­రో­వ­‌­ర్ ప్రా­జె­క్టు ని­లు­స్తుం­ద­‌­ని పే­ర్కొ­న్నా­రు. గాం­ధీ సి­ద్ధాం­తా­ల­ను ప్ర­చా­రం చేసే నా­లె­డ్జ్‌ హబ్‌, ధ్యాన గ్రా­మం ని­ర్మి­స్తా­మ­న్నా­రు. చే­నేత ప్ర­చార కేం­ద్రం, ప్ర­జా వి­నోద స్థ­లా­లు, ఘా­ట్లు, శాం­తి వి­గ్ర­హం, మ్యూ­జి­యం ఏర్పా­టు చే­స్తా­మ­ని రా­జ్‌­నా­థ్‌ సిం­గ్‌­కు తె­లి­పా­రు.

నితిన్ గడ్కరీతోనూ భేటీ

కేం­ద్ర రవా­ణా, జా­తీయ రహ­దా­రుల శాఖ మం­త్రి ని­తి­న్ గడ్క­రీ­తో­నూ రే­వం­త్ సమా­వే­శ­మ­య్యా­రు. భా­ర­‌­త్ ఫ్యూ­చ­‌­ర్ సిటీ నుం­చి అమ­‌­రా­వ­‌­తి మీ­దు­గా బం­ద­‌­రు పో­ర్ట్ వ‌­ర­‌­కు 12 వ‌­రు­స­‌ల గ్రీ­న్‌­ఫీ­ల్డ్ ర‌­హ­‌­దా­రి ని­ర్మా­ణా­ని­కి వెం­ట­‌­నే అను­మ­‌­తు­లు మం­జూ­రు చే­యా­ల­‌­ని సీఎం రే­వం­త్ రె­డ్డి కేం­ద్ర మం­త్రి­ని వి­జ్ఞ­‌­ప్తి చే­శా­రు. రా­ష్ట్ర పు­న­‌­ర్వి­భ­‌­జ­‌న చ‌­ట్టం ప్ర­‌­కా­రం కూడా తె­లం­గా­ణ‌-ఆం­ధ్ర­‌­ప్ర­‌­దే­శ్ రా­జ­‌­ధా­నుల మ‌­ధ్య గ్రీ­న్‌­ఫీ­ల్డ్ ర‌­హ­‌­దా­రి ని­ర్మిం­చా­ల్సి ఉం­ద­‌­ని సీఎం గు­ర్తు చే­శా­రు. తె­లం­గా­ణ­‌­కు స‌­ము­ద్ర రేవు లే­నం­దున.. బం­ద­‌­రు పో­ర్ట్ వ‌­ర­‌­కు స‌­ర­‌­కు ర‌­వా­ణా­కు వీ­లు­గా గ్రీ­న్ ఫీ­ల్డ్ ర‌­హ­‌­దా­రి మం­జూ­రు చే­యా­ల­‌­ని కో­రా­రు. ఈ గ్రీ­న్‌­ఫీ­ల్డ్ ర‌­హ­‌­దా­రి­లో 118 కి­లో­మీ­ట­ర్లు తె­లం­గా­ణ­‌­లో ఉం­టుం­ద­‌­ని... మి­గ­‌­తా భాగం ఏపీ­లో ఉం­టుం­ద­‌­ని సీఎం వి­వ­‌­రిం­చా­రు. అం­త­కు­ముం­దు కేం­ద్ర ఆర్థిక శాఖ మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్‌­‌­తో భేటీ అయిన రే­వం­త్.. తె­లం­గాణ వి­ద్యా రం­గం­లో స‌­మూ­ల­‌­మా­ర్పు­లు తే­వ­‌­డా­ని­కి తాము చే­స్తు­న్న­‌­కృ­షి­కి మ‌­ద్ద­‌­తు ఇవ్వా­ల­‌­ని కో­రా­రు. ఇం­టి­గ్రే­టె­డ్‌ స్కూ­ళ్ల ని­ర్మా­ణా­ని­కి అవ­స­రం అయ్యే ఆర్థిక వన­రుల సమీ­క­ర­ణ­కు కేం­ద్రం మద్ద­తు ఇవ్వా­ల­ని రేవంత్ రెడ్డి కో­రా­రు.

Tags:    

Similar News