REVANTH: నిరుద్యోగులకు శుభవార్త... త్వరలోనే 40 వేల ఉద్యోగాలు

త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన... భవిష్యత్తు ప్రణాళికల కోసమే గ్లోబల్ సమిట్ నిర్వహణ... ప్రపంచానికి మన విజన్ చూపించబోతున్నామన్న రేవంత్

Update: 2025-12-04 03:30 GMT

రెం­డు­న్న­రే­ళ్ల పాలన పూ­ర్త­య్యే­లో­గా లక్ష ఉద్యో­గా­లు పూ­ర్తి చే­స్తా­మ­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి చె­ప్పా­రు. ఇప్ప­టి­కే 60 వేల ఉద్యో­గా­లు ఇచ్చా­మ­ని త్వ­ర­లో మరో 40 వేల ఉద్యో­గా­లు ఇస్తా­మ­ని అన్నా­రు. హు­స్నా­బా­ద్ ప్ర­జల అభి­మా­నం మరు­వ­లే­ని­ద­ని ఈ ప్రాం­తం నుం­చే బహు­జ­ను­లు­దుం­డు కట్టి ఉద్య­మిం­చా­ర­ని చె­ప్పా­రు. 2001లో ఈ ప్రాం­తం నుం­చే ఉద్య­మం ఉవ్వె­త్తున లే­చిం­ద­ని 2004లో కరీం­న­గ­ర్ గడ్డ నుం­చే సో­ని­యా గాం­ధీ తె­లం­గాణ ఇస్తా­మ­ని మాట ఇచ్చి 2014లో స్వ­రా­ష్ట్ర ఆకాం­క్ష­ను నె­ర­వే­ర్చా­ర­ని గు­ర్తు చే­శా­రు. 2023 డి­సెం­బ­ర్ 3న పదే­ళ్ల పా­ల­న­కు చర­మ­గీ­తం పా­డా­రు. శ్రీ­కాం­తా­చా­రి బలి­దా­నం జరి­గిం­ది కూడా ఇదే రోజు అన్నా­రు. సి­ద్ది­పేట జి­ల్లా హు­స్నా­బా­ద్‌­లో బు­ధ­వా­రం ని­ర్వ­హిం­చిన ‘ప్ర­జా­పా­లన- ప్ర­జా వి­జ­యో­త్సవ సభ’కు ఆయన ము­ఖ్య అతి­థి­గా వి­చ్చే­శా­రు. పదే­ళ్లు రా­జ­కీ­యా­లు పక్కన పె­ట్టి గ్రా­మా­ల్లో అం­ద­రూ ఏకమై సర్పం­చ్ లను ఏక­గ్రీ­వం చే­సు­కో­వా­ల­ని లేదా మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­ల­తో కలి­సి మె­లి­సి పని చేసే వా­రి­నే సర్పం­చ్‍లు­గా ఎన్ను­కో­వా­ల­ని రే­వం­త్ రె­డ్డి పి­లు­పు­ని­చ్చా­రు. మద్యా­ని­కి ఆశ­ప­డో కా­ళ్ల­లో కట్టె­లు పె­ట్టే­వా­రి­ని ఎన్ను­కుం­టే అది వా­రి­కి రా­జ­కీ­యం­గా పని­కి వస్తుం­దే­మో కానీ మీ గ్రా­మా­భి­వృ­ద్ధి­కి ని­ధు­లు రా­వ­న్నా­రు. కేం­ద్రం­తో కొ­ట్లా­డై­నా అత్య­ధిక ని­ధు­లు గ్రా­మా­ల­కు వచ్చే బా­ధ్య­త­ను తాను తీ­సు­కుం­టా­న­న్నా­రు. కి­రి­కి­రి సర్పం­చ్ లు వస్తే ఐదే­ళ్ల కాలం వృథా అవు­తుం­ద­న్నా­రు. సి­ద్ధి­పేట జి­ల్లా హు­స్నా­బా­ద్ లో రూ. 262.78 కో­ట్ల­తో పలు అభి­వృ­ద్ధి పను­ల­కు సీఎం రే­వం­త్ రె­డ్డి శం­కు­స్థా­పన చే­శా­రు. రూ. 44.12 కో­ట్ల­తో హు­స్నా­బా­ద్‌­లో ఇం­జ­నీ­రిం­గ్ కళా­శాల ని­ర్మా­ణా­ని­కి శం­కు­స్థా­పన చే­శా­రు. రూ. 45.15 కో­ట్ల­తో హు­స్నా­బా­ద్‌­లో ATC ఏర్పా­టు­తో పాటు రూ. 20 కో­ట్ల­తో హు­స్నా­బా­ద్ ము­ని­సి­పా­లి­టీ పరి­ధి­లో పలు అభి­వృ­ద్ధి పను­ల­కు శ్రీ­కా­రం చు­ట్టా­రు. అలా­గే, రూ. 8.60 కో­ట్ల­తో RTA యూ­ని­ట్ ఆఫీ­స్ కు శం­కు­స్థా­పన చే­శా­రు.

రూ. 86 కో­ట్ల­తో హు­స్నా­బా­ద్ అర్బ­న్- కొ­త్త­ప­ల్లి ప్యా­కే­జీ-1లో భా­గం­గా 4 లై­న్ల రహ­దా­రి ని­ర్మా­ణా­ని­కి శం­కు­స్థా­పన చే­య­గా.. రూ. 58.91 కో­ట్ల­తో హు­స్నా­బా­ద్- అక్క­న్న­పేట నా­లు­గు లై­న్ల రహ­దా­రి ని­ర్మా­ణా­ని­కి సీఎం రే­వం­త్ రె­డ్డి శం­కు­స్థా­పన చే­శా­రు. ఉమ్మ­డి కరీం­న­గ­ర్, వరం­గ­ల్‌ జి­ల్లా­ల్లో­ని లక్షల ఎక­రా­ల­కు నీ­రం­దిం­చే ఎస్సా­రె­స్పీ ప్రా­జె­క్టు­ను నె­హ్రూ హయాం­లో మొ­ద­లు పె­డి­తే కా­ల­క్ర­మం­లో కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వం పూ­ర్తి చే­సిం­ది. నా­గా­ర్జు­న­సా­గ­ర్, శ్రీ­శై­లం, జూ­రాల ప్రా­జె­క్టు­ల­న్నీ మా ప్ర­భు­త్వాల హయాం­లో­ని­వే. ఈ రోజు వరి­ని అత్య­ధి­కం­గా పం­డి­స్తు­న్న రా­ష్ట్రా­ల్లో మనదే మొ­ద­టి స్థా­నం. ఉమ్మ­డి మె­ద­క్‌ జి­ల్లా ఇన్‌­ఛా­ర్జి మం­త్రి వి­వే­క్‌ వెం­క­ట­స్వా­మి మా­ట్లా­డు­తూ.. ‘‘రూ.14 వేల కో­ట్ల వ్య­యం­తో సన్న బి­య్యా­న్ని పే­ద­ల­కు ఇస్తు­న్నాం. గత ప్ర­భు­త్వ హయాం­లో కే­సీ­ఆ­ర్‌ కు­టుం­బం ఆస్తు­ల­ను పెం­చు­కుం­ది’’అని వి­మ­ర్శిం­చా­రు. మం­త్రి శ్రీ­ధ­ర్‌­బా­బు మా­ట్లా­డు­తూ.. ‘‘ప్ర­జల జీ­వి­తా­ల్లో మా­ర్పు తీ­సు­కొ­స్తా­మ­ని ఎన్ని­కల సమ­యం­లో ఇచ్చిన హా­మీ­ని నె­ర­వే­రు­స్తూ యువత భవి­త­కు బం­గా­రు బా­ట­లు వే­స్తు­న్నాం. పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్‌ బల­ప­ర్చిన అభ్య­ర్థు­ల­ను గె­లి­పిం­చా­లి’’ అని కో­రా­రు. మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌ మా­ట్లా­డు­తూ.. ‘‘రెం­డే­ళ్ల కిం­దట ఏర్పా­టైన కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వం ప్ర­జ­ల­కి­చ్చిన ప్ర­తి మా­ట­ను నె­ర­వే­రు­స్తుం­ది. ఇదే మై­దా­నం­లో ప్రి­యాం­కా­గాం­ధీ హామీ ఇచ్చిన వి­ధం­గా అభి­వృ­ద్ధి ఫలా­లు అం­దిం­చి చూ­పి­స్తు­న్నాం.’అని కొ­ని­యా­డా­రు.

Tags:    

Similar News