REVANTH: చక్క నీరు వదలం.. మూసీ సుందరీకరణను విడవం

ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది... ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్.. పాఠశాలల రూపు రేఖలు మారబోతున్నాయ్

Update: 2025-09-18 03:00 GMT

ప్ర­జ­లే రా­సు­కు­న్న పో­రాట చరి­త్ర మన­ద­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. పబ్లి­క్‌ గా­ర్డె­న్‌­లో ని­ర్వ­హిం­చిన తె­లం­గాణ ప్ర­జా­పా­లన ది­నో­త్స­వం­లో జా­తీయ జెం­డా­ను ఆవి­ష్క­రిం­చిన అనం­త­రం ఆయన ప్ర­సం­గిం­చా­రు.‘‘ప్ర­పంచ ఉద్య­మా­ల్లో సు­వ­ర్ణా­క్ష­రా­ల­తో లి­ఖిం­చ­ద­గిన పో­రా­టం మనది. సా­యుధ పో­రా­ట­స్ఫూ­ర్తి­తో ని­న్న­టి ని­యంత పా­ల­న­ను పక్క­న­పె­ట్టాం. బం­ధు­ప్రీ­తి, ఆశ్రిత పక్ష­పా­తా­ని­కి మా పా­ల­న­లో తా­వు­లే­దు. స్వే­చ్ఛ, సమాన అవ­కా­శా­లు, సా­మా­జిక న్యా­యం­లో రో­ల్‌­మో­డ­ల్‌­గా ఉన్నాం. ఉన్నత చదు­వుల ద్వా­రా మన యువత సత్తా చా­టా­లి. భవి­ష్య­త్తు­లో పా­ఠ­శా­లల రూ­పు­రే­ఖ­లు మా­ర­బో­తు­న్నా­యి. వి­ద్య­తో పాటు క్రీ­డ­ల­కు ప్రా­ధా­న్యత ఇస్తు­న్నాం. త్వ­ర­లో రా­ష్ట్ర వి­ద్యా వి­ధా­నం తె­స్తు­న్నాం. సా­యుధ పో­రా­టం­లో మహి­ళల పా­త్ర ఎన­లే­ని­ది. చా­క­లి ఐల­మ్మ, మల్లు స్వ­రా­జ్యం, ఆరు­ట్ల కమ­లా­దే­వి సత్తా­చా­టా­రు.

 నీటి వాటాల విషయంలో రాజీలేదు

గో­దా­వ­రి జలా­ల­కు సం­బం­ధిం­చి నీటి వా­టాల వి­ష­యం­లో రా­జీ­ప­డే ప్ర­స­క్తే­లే­ద­ని సీఎం రే­వం­త్ రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. గత పా­ల­కు­లు చే­సిన తప్పు­ల­ను సరి­ది­ద్ది ప్ర­తి నీటి చు­క్క­పై హక్క­లు సా­ధి­స్తా­మ­ని చె­ప్పా­రు. కృ­ష్ణా జలాల వి­ష­యం­లో న్యాయ పో­రా­టా­ని­కి తె­లం­గాణ ప్ర­భు­త్వం సి­ద్ద­మ­వు­తుం­ద­ని తె­లి­పా­రు. రా­ష్ట్రా­ని­కి రా­వా­ల్సిన నీటి వా­టా­ను తప్ప­కుం­డా దక్కిం­చు­కుం­టా­మ­ని పే­ర్కొ­న్నా­రు. డ్వా­క్రా ఉత్ప­త్తుల వి­క్ర­యా­ని­కి మరి­న్ని మహి­ళా మా­ర్టు­లు ఏర్పా­టు చే­స్తా­మ­న్నా­రు.


మూసీ సుందరీకరణతో కొత్త ఆర్థిక వ్యవస్థ

మూ­సీ­ని శు­ద్ధి చేసి కొ­త్త ఆర్థిక వ్య­వ­స్థ­ను సృ­ష్టి­స్తా­మ­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. ప్ర­పంచ పర్యా­ట­కు­ల­ను ఆక­ర్షిం­చే­లా మూసీ సుం­ద­రీ­క­రణ ఉం­టుం­ద­ని పే­ర్కొ­న్నా­రు. దీని వల్ల మూసీ చు­ట్టూ బతు­కు­తు­న్న ప్ర­జల జీవన ప్ర­మా­ణా­లు పె­రు­గు­తా­య­ని చె­ప్పా­రు. 2050 మా­స్ట­ర్‌­ప్లా­న్‌­కు అను­గు­ణం­గా మూసీ పరి­స­రా­ల­ను జో­న్ల వా­రీ­గా వి­భ­జిం­చి వా­ణి­జ్య కా­ర్య­క­లా­పా­ల­ను అను­మ­తిం­చా­ల­ని ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది. "మూసీ నది పక్కన జీ­విం­చే పే­ద­ల­కు మంచి జీవన ప్ర­మా­ణా­లు కల్పి­స్తాం. ఈ పరి­ధి­లో ఉన్న­వా­రి­కి ఉద్యోగ, ఉపా­ధి అవ­కా­శా­లు కల్పి­స్తాం. పర్యా­ట­కు­ల­ను ఆక­ర్షిం­చే­లా మూసీ నది­ని మా­రు­స్తాం. ఈ ఏడా­ది డి­సెం­బ­ర్‌ 9 లోగా అనేక అభి­వృ­ద్ధి పను­లు ప్రా­రం­భి­స్తాం." అని రే­వం­త్ తె­లి­పా­రు.

ఫాంహౌస్‌లో గంజాయి పండిస్తే...

హై­ద­రా­బా­ద్ డ్ర­గ్స్‌­కు గేట్ వేగా మా­రిం­ద­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. అం­దు­కే డ్ర­గ్స్ ని­యం­త్రణ కోసం ఈగ­ల్‌ టీ­మ్‌­ను ఏర్పా­టు చే­శా­మ­ని చె­ప్పా­రు. డ్ర­గ్స్, గం­జా­యి ని­ర్మూ­ల­న­కు తమ ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­న్నా­రు. డ్ర­గ్స్ కట్ట­డి చర్య­లు కొం­ద­రి­కి నచ్చ­క­పో­వ­చ్చ­ని, కానీ ఈ వ్యా­పా­రం­లో ఎంత పె­ద్దో­ళ్లు ఉన్నా కని­క­రిం­చే­ది లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు. ఫాం­హౌ­స్‌­ల­లో గం­జా­యి పం­డిం­చి సర­ఫ­రా చే­స్తే ఊరు­కో­మ­ని వా­ర్నిం­గ్ ఇచ్చా­రు. కా­లు­ష్యం లేని నగ­రం­గా హై­ద­రా­బా­ద్ను మా­రు­స్తా­మ­న్నా­రు.

అమర వీరులకు సీఎం నివాళి

తె­లం­గాణ ప్ర­జల స్వా­తం­త్ర్య స్ఫూ­ర్తి­ని సీఎం రే­వం­త్ కొ­ని­యా­డా­రు. అమర వీ­రుల స్తూ­పం వద్ద అమ­రు­ల­కు ని­వా­ళు­లు అర్పిం­చా­రు. స్వే­చ్ఛ కోసం ప్రా­ణ­త్యా­గం చే­సిన అమ­ర­వీ­రు­ల­కు ఘన ని­వా­ళు­లు అర్పిం­చా­రు. డి­సెం­బ­ర్ 7, 2023ను కూడా మరో చా­రి­త్రక రో­జు­గా చె­ప్పిన ఆయన.. గత బీ­ఆ­ర్ఎ­స్ ని­యం­తృ­త్వ పా­ల­న­ను అం­త­మొం­దిం­చి ప్ర­జా­స్వా­మ్య పా­ల­న­ను తి­రి­గి స్థా­పిం­చి­న­ట్లు వి­వ­రిం­చా­రు. తె­లం­గాణ సా­యుధ పో­రా­టం... ప్ర­పంచ ఉద్య­మాల చరి­త్ర­లో సు­వ­ర్ణా­క్ష­రా­ల­తో లి­ఖిం­చ­ద­గి­న­ద­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. ఈ పో­రా­టం ద్వా­రా సా­మా­న్య ప్ర­జ­లు ని­జాం రా­చ­రి­కా­న్ని ఓడిం­చి, ప్ర­జా­స్వా­మ్యా­న్ని స్థా­పిం­చా­ర­న్నా­రు.

Tags:    

Similar News