REVANTH: ఎకరా పంట నష్టానికి రూ.10 వేలు

ఇల్లు మునిగితే రూ.15 వేలు ఆర్థిక సాయం,.. తుఫాన్ ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సర్వే

Update: 2025-10-31 13:00 GMT

మొం­థా తు­పా­ను ప్ర­భా­విత ప్రాం­తా­ల­ను మం­త్రు­ల­తో కలి­సి ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌ రె­డ్డి పరి­శీ­లిం­చా­రు. బా­ధి­తు­ల­తో మా­ట్లా­డి వి­వ­రా­ల­ను తె­లు­సు­కు­న్నా­రు. బా­ధి­తు­లు సీ­ఎం­కు వి­న­తి­ప­త్రా­లు అం­ద­జే­శా­రు. అనం­త­రం హన్మ­కొండ కలె­క్ట­రే­ట్ వే­ది­క­గా అధి­కా­రు­ల­తో సీఎం రే­వం­త్ సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. క్షే­త్ర స్థా­యి­లో పర్య­టిం­చి పూ­ర్తి­స్థా­యి నష్టా­న్ని అం­చ­నా వే­యా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. ప్రా­ణ­న­ష్టం, పం­ట­న­ష్టం, పశు­సం­పద, అన్ని శా­ఖ­ల­కు సం­బం­ధిం­చి ఇన్ఫ్రా­స్ట్ర­క్చ­ర్ నష్టా­ని­కి సం­బం­ధిం­చి ని­వే­ది­క­లు తె­ప్పిం­చు­కోం­డ­ని చె­ప్పా­రు. ఇం­దు­కు ప్ర­జా­ప్ర­తి­ని­ధుల సహ­కా­రం కూడా తీ­సు­కో­వా­ల­ని సూ­చిం­చా­రు. తె­లం­గాణ ధనిక రా­ష్ట్రం అని వది­లే­స్తే కు­ద­ర­దు, మం­త్రు­లు, కలె­క్ట­ర్లు ని­వే­ది­క­లు రెడీ చే­యా­ల­ని అన్నా­రు. ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు తమ ని­యో­జ­క­వ­ర్గా­ల­కు సం­బం­ధిం­చి కలె­క్ట­ర్ల­కు రి­పో­ర్ట్ ఇవ్వా­ల­ని ఆదే­శిం­చా­రు. "తు­పా­ను ప్ర­భా­వం­తో 12 జి­ల్లా­ల్లో తీ­వ్ర నష్టం జరి­గిం­ది. కేం­ద్ర ప్ర­భు­త్వం నుం­చి రా­వా­ల్సిన ని­ధు­ల­ను రా­బ­ట్టు­కో­వా­లి. కేం­ద్రం ని­ధుల వి­ష­యం­లో అల­స­త్వం వద్దు. తా­త్కా­లిక పరి­ష్కా­రం కా­కుం­డా శా­శ్వత పరి­ష్కా­రం ది­శ­గా ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చం­డి. సమ­న్వయ లో­పం­తో సమ­స్య­లు పె­రు­గు­తు­న్నా­యి. అన్ని వి­భా­గాల అధి­కా­రు­లు సమ­న్వ­యం­తో పని­చే­యా­లి. నా­లాల కబ్జా­ల­ను తొ­ల­గిం­చా­ల్సిం­దే.. ఎం­త­టి­వా­రై­నా ఉపే­క్షిం­చే­ది లేదు.” అని రే­వం­త్ అన్నా­రు

ఆర్థిక సాయానికి ప్రణాళికలు

వర­ద­లు తగ్గిన నే­ప­థ్యం­లో శా­ని­టే­ష­న్ ప్ర­క్రి­య­ను వే­గ­వం­తం చే­యా­ల­ని రే­వం­త్ ఆదే­శిం­చా­రు. వర­ద­ల్లో ప్రాణ నష్టం జరి­గి­న­చోట రూ.5 లక్ష­లు పరి­హా­రా­ని­కి ప్ర­భు­త్వం సి­ద్ధం­గా ఉం­ద­న్నా­రు. ఇం­దు­కు సం­బ­ధిం­చి వి­వ­రా­లు సే­క­రిం­చా­ల­ని.. పం­ట­న­ష్టం, పశు సంపద నష్ట­పో­యిన చోట వా­రి­కి పరి­హా­రం అం­దిం­చా­ల­న్నా­రు. ఇసుక మే­ట­లు పే­రు­కు­న్న రై­తు­ల­ను ఆదు­కు­నేం­దు­కు చర్య­లు తీ­సు­కో­వా­ల­న్నా­రు. "ఇం­డ్లు ము­ని­గిన వా­రి­కి ప్ర­తీ ఇం­టి­కి రూ.15 వేలు..ఎకరా పంట నష్టా­ని­కి రూ.10వేలు ఇచ్చేం­దు­కు ప్ర­ణా­ళి­క­లు సి­ద్దం చే­యా­లి. ఇం­ది­ర­మ్మ ఇం­డ్లు ఇచ్చే అం­శా­న్ని పరి­శీ­లిం­చా­లి. ము­న్సి­ప­ల్, ఇరి­గే­ష­న్ అధి­కా­రు­లు సమ­న్వ­యం­తో పని­చే­యా­లి. స్మా­ర్ట్ సి­టీ­లో చే­యా­ల్సిన పను­ల­పై ప్ర­త్యేక ని­వే­దిక తయా­రు చే­యా­లి. ఎక్క­డా పను­లు ఆపే ప్ర­స­క్తి ఉం­డొ­ద్దు. క్షే­త్ర­స్థా­యి­లో ఒక కో-ఆర్డి­నే­ష­న్ కమి­టీ వే­సు­కు­ని పని­చే­యా­లి. అధి­కా­రు­లు ని­ర్ల­క్ష్యం వద­లం­డి క్షే­త్ర­స్థా­యి­కి వె­ళ్లం­డి.. కలె­క్ట­ర్లు కూడా ఫీ­ల్డ్ వి­జి­ట్స్ చే­యా­ల్సిం­దే అని సీఎం రే­వం­త్ రె­డ్డి ఆదే­శిం­చా­రు.

Tags:    

Similar News