Revanth Reddy: రైతులను మోడీ, కేసీఆర్ మోసం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి..
Revanth Reddy: మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆదానీ, ఆంబానీలకు దోచిపెడుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.;
Revanth Reddy (tv5news.in)
Revanth Reddy: మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆదానీ, ఆంబానీలకు దోచిపెడుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులను మోసం చేయడంలో మోడీ, కేసీఆర్ దొందూ దొందేనని విరుచుకుపడ్డారు. లఖీంపూర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ చేపట్టిన దేశ వ్యాప్త అందోళనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మౌనదీక్ష చేపట్టింది.
పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.... కేంద్ర తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతాంగం ఏడాదికాలంగా ఆందోళన చేస్తున్నా మోదీ ప్రభుత్వానికి పట్టడం లేదనీ, మోదీ మన్ కీ బాత్ కాదు రైతుల ఆవేదన వినాలని సూచించారు.