Revanth Reddy : బ్రిటీష్ నినాదాన్ని మోదీ, కేసీఆర్‌ అమలుచేస్తున్నారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy : బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన గాంధీజయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని.... మహాత్ముడికి నివాళులర్పించారు;

Update: 2022-10-02 09:15 GMT

Revanth Reddy : బ్రిటీష్ వారు అమలు చేసిన విభజించు పాలించు నినాదాన్ని మోదీ, కేసీఆర్‌లు అమలు చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రజల మధ్య గోడలు నిర్మించేలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన గాంధీజయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని.... మహాత్ముడికి నివాళులర్పించారు.

ప్రపంచానికి గాంధీ ఇజం పరిచయం చేసింది మహాత్ముడేనని కొనియాడారు. ఉప్పుసత్యాగ్రహం, దండియాత్రలు ఎలా స్పూర్తిని నింపాయో...రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రసైతం అలానే స్పూర్తి నింపుతుందన్నారు.

Tags:    

Similar News