Revanth Reddy : తెలంగాణ ప్రజలకు, కేసీఆర్‌కు రుణం తీరిపోయింది : రేవంత్ రెడ్డి
Revanth Reddy : కేసీఆర్ రాజకీయ దురాశ కోసమే బీఆర్‌ఎస్ ఏర్పాటని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు;
KCR : కేసీఆర్ రాజకీయ దురాశ కోసమే బీఆర్‌ఎస్ ఏర్పాటని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలను మభ్య పెట్టడానికే బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసి, తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారన్నారు.
కేసీఆర్ వ్యవహార శైలి వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయిందని, తెలంగాణ పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆర్థికంగా బలోపేతమయ్యారని, తన ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని గ్రహించడం వల్లే బీఆర్‌ఎస్ పెట్టుకున్నారన్నారు.