Revanth Reddy : 7వ సారి కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే : రేవంత్ రెడ్డి
Revanth Reddy : మునుగోడులో మరోసారి సత్తాచాటేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు టీసీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి;
Revanth Reddy : మునుగోడులో మరోసారి సత్తాచాటేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు టీసీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మునుగోడులో ఇప్పటి వరకు ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని.. ఇప్పుడు 7వసారి కూడా కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కడుతారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే.. 6సార్లు కాంగ్రెస్, 5సార్లు కమ్యూనిస్టులు గెలిచారని,.. ఒక్కసారి మాత్రమే టీఆర్‌ఎస్ గెలిచిందన్నారు. ఈ ప్రాంత వెనుకబాటుతనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. బిజేపీకి డిపాజిట్ కూడా దక్కదని రేవంత్ వెల్లడించారు. ఇక్కడి ప్రాంతంలో ఈ మాత్రం అభివృద్ది జరిగిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల నేఅన్నారు.