REVANTH: సాఫ్ట్వేర్ కోర్సులతోనే ఉద్యోగాలు రావు
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం... విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు అవసరం.. యువత స్కిల్స్ పెంచేందుకు టాటాతో చర్చలు: సీఎం
2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను అలాగే అలాగే రాష్ట్రంలోని 65 ఏటీసీలను వర్చువల్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ పునర్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. ఐటీఐలను ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 1956లో ప్రారంభించారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదని, కోర్సులను అప్ గ్రేడ్ చేయకపోవడంతో కాలక్రమేనా ఐటీఐలు నిర్వీర్యమయ్యాయన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు అవసరమని భావించామన్నారు. యువతలో స్కిల్స్ పెంచడం కోసం టాటా టెక్నాలజీస్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు. వారి సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. నైపుణ్యం లేకుండా ఇంజినీరింగ్ పట్టా ఉన్నా ఏమాత్రం ఉపయోగం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ యువతను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. యువతలో నైపుణ్యం ఉంటే దేశాలన్నీ మన మందు మోకరిల్లుతాయని కామెంట్ చేశారు.
విద్యార్థులకు ప్రతి నెలా రూ.2 వేలు
నేటి యుగంలో ఉద్యోగం కావాలంటే నైపుణ్యం తప్పనిసరి అని రేవంత్ రెడ్డి అన్నారు. తలరాతలు మారలంటే చదువు ఒక్కటే మార్గమని.. అదరికీ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఉన్నా.. యువతలో నైపుణ్యం లేదని విషయం తమ దృష్టి వచ్చిందని అన్నారు. హైదరాబాద్ వచ్చాక చదువుతో పాటు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు ఆలోచన చేశామని అన్నారు. మంత్రివర్గ భేటీలో చర్చించి ఐటఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటరలుగా మార్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా మొత్తం టాటా సంస్థనే భరించిందని అన్నారు. ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ పొందిన 90 శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు. త్వరలో మరో 53 ఏటీసీలను పెడుతున్నాయని స్పష్టం చేశారు. స్కిలు లేకపోవడంతో యువతకు ఉద్యోగాలు రాక చెడు వ్యసనాలకు బానినలు అవుతున్నారని, గంజాయి కేసులు పెరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయ అలవాటు నుంచి అమ్మకందారులుగా మారుతున్నారని తెలిపారు.