SAD: పెళ్లి కావడం లేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

ఓ యువతి విషాధ గాథ

Update: 2026-02-03 05:00 GMT

కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం మధ్య నలిగిపోయిన ఓ యువతి తీవ్ర మనోవేదనకు లోనై ప్రాణాలు తీసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో విషాదాన్ని నింపింది. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఒక వైపు, తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి మరోవైపు ఆమెను మానసికంగా కుంగదీసినట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి (26) కొద్ది రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆమె, అనారోగ్యం, వైకల్యంతో బాధపడుతున్న తల్లిని ఏళ్లుగా తానే చూసుకుంటూ వస్తోంది. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంటి సంరక్షణ మొత్తం ఆమె భుజాలపైనే ఉండటంతో, విజయలక్ష్మి పూర్తిగా కుటుంబానికే అంకితమై జీవనం సాగించినట్లు బంధువులు చెబుతున్నారు.

ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న విజయలక్ష్మికి వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ, తల్లిని విడిచి వెళ్లలేనన్న ఆందోళన ఆమెను తీవ్రంగా వెంటాడింది. పెళ్లి అయితే తల్లిని ఎవరు చూసుకుంటారన్న భయం, మరోవైపు వివాహం జరగకపోతే సమాజంలో ఎదురయ్యే ఒత్తిడి  ఈ రెండింటి మధ్య ఆమె మానసికంగా తీవ్రంగా సతమతమైంది. వై­క­ల్యం­తో బా­ధ­ప­డు­తు­న్న తల్లి­కి.. ఐటీ సం­స్థ­లో పని­చే­స్తూ­నే వి­జ­య­ల­క్ష్మి.. అన్నీ తానై సప­ర్య­లు చే­స్తూ కం­టి­కి రె­ప్ప­లా కా­పా­డు­కుం­టూ వస్తోం­ది. ఐటీ సం­స్థ­లో ఉద్యో­గం చే­స్తు­న్న లక్ష్మి­కి పలు వి­వాహ సం­బం­ధా­లు వచ్చా­యి. కానీ.. తల్లి తన­తో­పా­టే ఉం­టుం­ద­ని వి­జ­య­ల­క్ష్మి వా­రి­కి చె­బు­తూ వస్తోం­ది.. దీం­తో వారు పె­ళ్లి చే­సు­కు­నేం­దు­కు ఇష్ట­ప­డ­టం లే­ద­ని మన­స్థా­పా­ని­కి లో­నైం­ది. గత నెల 31వ తే­దీన రెం­డు రో­జు­ల్లో తి­రి­గి వస్తా­న­ని.. కూ­క­ట్‌­ప­ల్లి­లో­ని తల్లి­కి చె­ప్పి బయ­ట­కు వె­ళ్లిన వి­జ­య­ల­క్ష్మి హు­స్సే­న్‌­సా­గ­ర్ లో దూకి ప్రా­ణా­లు తీ­సు­కుం­ది.

Tags:    

Similar News