Gun Fire: అమెరికాలో కాల్పులు.. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
Gun Fire: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జరిగిన ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు.;
Gun Fire: తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన నక్కా సాయి చరణ్ (26) అమెరికాలోని ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో మృతి చెందాడు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జరిగిన ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు.
నల్గొండ జిల్లాకు చెందిన నక్కా సాయి చరణ్ (26) ఆదివారం సాయంత్రం స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దింపి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు. మేరీల్యాండ్‌లోని కాటన్స్‌విల్లే సమీపంలో సాయి చరణ్ తన కారులో ప్రయాణిస్తున్నప్పుడు కాల్చి చంపబడ్డాడు. టెక్కీ తలపై కాల్పులు జరిగాయి. హుటాహుటిన యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ R. ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు.
సాయ చరణ్ గత రెండేళ్లుగా మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ నగరంలో ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాలని భారత ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.