తెలంగాణలో పాఠశాలల ప్రారంభం వాయిదా..!
జులై 1 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన వద్దంటూ పీఆర్‌టీయూ నేతలు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.;
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్లుగా జులై 1 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన వద్దంటూ పీఆర్‌టీయూ నేతలు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లోనే బోధన సాగించేలా చూడాలని కోరారు. అలాగే 50 శాతం ఉపాధ్యాయులతోనే పాఠశాలలు నడపాలని అభ్యర్థించారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్... ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని.. ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన కొనసాగించాలని.. అధికారులను ఆదేశించారు.