Schools reopen: పిల్లలూ.. రేపట్నించి బడికెళ్లాలి.. బ్యాగులు సర్దండి

Schools reopen: సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకోవాలని ఆదేశించారు.

Update: 2021-02-23 10:20 GMT

Schools reopen in telangana-state: తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీచేశారు. రేపటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని ఆమె వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకోవాలని ఆదేశించారు.

కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చి చివరి నుంచి దేశంలోని అన్ని విద్యాలయాలు మూతపడ్డాయి. సుదీర్ఘకాలం తర్వాత కాలేజీలు ప్రారంభమైనప్పటికీ... పాఠశాలలు మాత్రం తెరుచుకోలేదు. ఇక తెలంగాణలో ఇప్పటికే 9, 10 వ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మిగతా తరగతుల విద్యార్థులకు స్కూల్స్ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 6, 7, 8 తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Tags:    

Similar News