Sekhar Kammula: డీఏవీ స్కూల్ చిన్నారిపై లైంగిక దాడి.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషి మరీ మృగంలా మారుతున్నాడు.. ఒక్కోసారి జంతువులే నయం అనేలా ప్రవర్తిస్తున్నారు. అవి కూడా ఆకలేస్తేనే మరో జంతువును వేటాడుతాయి.

Update: 2022-10-22 08:13 GMT

Sekhar Kammula: మనిషి మరీ మృగంలా మారుతున్నాడు.. ఒక్కోసారి జంతువులే నయం అనేలా ప్రవర్తిస్తున్నారు. అవి కూడా ఆకలేస్తేనే మరో జంతువును వేటాడుతాయి. కానీ విచక్షణతో మెలగాల్సిన మానవులు జంతువుల కంటే అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు.

అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడి పైశాచిక ఆనందాన్ని తీర్చుకున్న డ్రైవర్‌కి ఏ శిక్ష వేస్తే ఆ తల్లిదండ్రుల కడుపుమంట చల్లారుతుంది. చిట్టి తల్లుల జీవితంపై మాయని మచ్చ మిగిల్చాడు దుర్మార్గుడు. ఈ భయంకర సంఘటనపై టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి అమానవీయ సంఘటనలు చిన్నారుల జీవితాల్లో జరగడం వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీపడకూడదు. ధైర్యంగా పోరాటం చేస్తున్న చిన్నారుల తల్లిదండ్రులకు జోహార్లు.

ఏమీ చేయలేని నిస్సహాయత. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని మనమే రూపొందించినవారమవుతాం' అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News