హకీంపేట స్పోర్ట్ స్కూల్‌లో ఓ అధికారి........ విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా .. బాలికల హాస్టల్లోని ఆ అధికారి తిష్ట వేసినట్లు తెలుస్తోంది. తమ పట్ల ఆ అధికారి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారంటూ హాస్టల్లోని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. అతను బలవంతపెట్టడంతో అతడితో కలిసి బయటకు వెళుతున్న విద్యార్థులు, హాస్టల్‌కు వచ్చాక, అతడు తమ పట్ల చేసిన దుశ్చర్యలను మహిళా ఉద్యోగులకు చెప్పుకొని విలపిస్తున్నారు. స్పోర్ట్స్ స్కూల్‌లో ఓ మహిళా ఉద్యోగితో ఆ అధికారి రాసనీలలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థినుల పట్ల ఆయన పాల్పడుతున్న ఆగడాలకు.... ఆమెతో పాటు మరో ఇద్దరు సీనియర్ కోచ్‌లు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ ఆ అధికారి కాళ్లు మొక్కాలంటూ విద్యార్థులను..... ఆ సీనియర్ కోచ్‌లు వేధిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. పూర్తి విచారణ చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరుతూ.. ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్ పై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...... ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో విచారణ చేస్తామని...నింధితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.