Shamshabad: ల్యాండింగ్ అన్నారు.. అంతలోనే...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాసేపు గందరగోళం; ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో తికమక; రన్ వే పై ల్యాండ్ అవుతూనే క్షణాల్లో మళ్లీ టేకాఫ్... భయాందోళనకు గురైన ప్రయాణికులు;
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాసేపు గందరగోళం నెలకొంది. ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రన్ వే పై విమానం ల్యాండ్ అవుతూనే క్షణాల్లో మళ్లీ టేకాఫ్ తీసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులు ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక కాసేపు టెన్షన్ కు గురయ్యారు. ఐదు నిమిషాల తరువాత తిరిగి సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ సమయంలో విజిబిలిటీ సరిగా లేకపోవడంతోనే మళ్లీ టేకాఫ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించారు. ఇక ఈ విమానం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.