Linewoman Sirisha: తెలంగాణలో తొలి లైన్ ఉమెన్.. తెలుగమ్మాయిల్లోనే ఫస్ట్..

Linewoman Sirisha: సిద్దిపేట జిల్లాకు చెందిన శిరీష మేడ్చల్ జిల్లాలో లైన్ ఉమెన్ నియమించబడింది.

Update: 2022-05-13 03:38 GMT

Linewoman Sirisha: పురుషులకంటే మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదు అని ఇప్పటికీ ఎంతోమంది నిరూపిస్తూనే ఉన్నారు. అయినా కొన్ని ఉద్యోగాలు చేయడం మహిళల వల్ల కాదు.. కేవలం పురుషులు మాత్రమే చేయగలరు అన్న ఆలోచన మాత్రం ఇంకా మారలేదు. అయితే ఇప్పటివరకు కేవలం పురుషులు మాత్రమే చేసిన లైన్ మెన్ ఉద్యోగంలో తొలిసారి ఓ లైన్ ఉమెన్ చేరింది. ఆ లైన్ ఉమెన్ కూడా తెలుగు రాష్ట్రం నుండి కావడం గర్వకారణం.

సిద్దిపేట జిల్లాకు చెందిన శిరీష మేడ్చల్ జిల్లాలో లైన్ ఉమెన్ నియమించబడింది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ నిర్వహించిన లైన్ ఉమెన్‌గా పనిచేయాల్సిన అన్ని టెస్టుల్లో శిరీష మంచి స్కోర్‌ను సాధించింది. పోల్‌ క్లైంబింగ్ టెస్ట్‌తో సహా తను అన్నింటిలో ఫస్ట్‌గా నిలిచింది. దీంతో మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా తనకు అపాయింట్‌మెంట్ లెటర్‌ను అందజేశారు.

శిరీష పుట్టింది సిద్ధిపేట అయినా.. పెరిగింది మాత్రం మేడ్చల్. ఇక అక్కడే తనకు లైన్ ఉమెన్‌గా పోస్టింగ్ కూడా దక్కింది. 'టీఎస్ ఎస్పీడిసిఎల్ లో తొలిసారిగా లైన్ ఉమెన్ గా ఉద్యోగం పొందిన శిరిషకు నియామక పత్రాన్ని అందించి, అభినందించారు ఉన్నతాధికారులు.' అన్న జగదీశ్ రెడ్డి.. శిరీషకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తున్న ఫోటోను ట్వీట్ చేశారు. 


Tags:    

Similar News