SAD: నగరం నడిబొడ్డున..ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2026-03-16 07:15 GMT

సమా­జం­లో అమా­యక చి­న్నా­రు­ల­పై జరు­గు­తు­న్న దా­రు­ణా­లు రో­జు­రో­జు­కూ ఆం­దో­ళన కలి­గి­స్తు­న్నా­యి. పో­లీ­సు­లు ఎన్నో చర్య­లు తీ­సు­కుం­టు­న్నా, కఠిన చట్టా­లు అమ­ల్లో ఉన్నా కూడా కా­మాం­ధుల దు­రా­గ­తా­లు ఆగడం లేదు. తా­జా­గా హై­ద­రా­బా­ద్ నగర శి­వా­రు­లో చో­టు­చే­సు­కు­న్న ఒక హృదయ వి­దా­రక ఘటన ప్ర­జ­ల­ను తీ­వ్రం­గా కల­చి­వే­సిం­ది. చా­క్లె­ట్ ఇస్తా­నం­టూ ఆశ చూ­పిం­చి ఆరే­ళ్ల చి­న్నా­రి­ని తన వెంట తీ­సు­కె­ళ్లిన ఓ వ్య­క్తి ఆమె­పై అత్యా­చా­రం చేసి, అనం­త­రం హత్య చే­య­డం నగ­రా­న్ని కు­ది­పే­సిం­ది. ఈ ఘటన బయ­ట­ప­డిన వెం­ట­నే స్థా­ని­కు­ల్లో ఆగ్ర­హం చె­ల­రే­గిం­ది. చి­న్నా­రి ప్రా­ణం తీ­సిన నిం­ది­తు­డి­కి కఠిన శి­క్ష వి­ధిం­చా­ల­ని ప్ర­జ­లు డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు. ఈ అమా­న­వీయ ఘటన హై­ద­రా­బా­ద్ నగర శి­వా­రు­లో­ని నా­ర్సిం­గి పో­లీ­స్ స్టే­ష­న్ పరి­ధి­లో జరి­గిం­ది. పో­లీ­సుల కథనం ప్ర­కా­రం, స్థా­ని­కం­గా ని­వ­సిం­చే ఆరే­ళ్ల బా­లిక ఆది­వా­రం సా­యం­త్రం ఇంటి దగ్గర ఆడు­కుం­టూ ఉం­డ­గా అక­స్మా­త్తు­గా కని­పిం­చ­కుం­డా పో­యిం­ది. బా­లిక ఇం­టి­కి రా­క­పో­వ­డం­తో కు­టుంబ సభ్యు­లు ఆం­దో­ళ­న­కు గు­ర­య్యా­రు. చు­ట్టు­ప­క్కల ప్రాం­తా­ల్లో వె­తి­కి­నా ఆచూ­కీ దొ­ర­క­క­పో­వ­డం­తో రా­త్రి సు­మా­రు 10 గంటల ప్రాం­తం­లో బా­లిక తల్లి­దం­డ్రు­లు పో­లీ­స్ స్టే­ష­న్‌­లో ఫి­ర్యా­దు చే­శా­రు.

కొ­ద్ది గం­ట­ల్లో­నే నిం­ది­తు­డి­ని అదు­పు­లో­కి తీ­సు­కు­న్న పో­లీ­సు­లు అత­డి­ని వి­చా­రిం­చా­రు. మొదట తప్పిం­చు­కు­నే ప్ర­య­త్నం చే­సి­నా, పో­లీ­సు­లు కఠి­నం­గా ప్ర­శ్నిం­చ­డం­తో అతడు చే­సిన ఘోర నే­రా­న్ని అం­గీ­క­రిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. చా­క్లె­ట్ ఇస్తా­న­ని చె­ప్పి చి­న్నా­రి­ని తన వెంట తీ­సు­కె­ళ్లి­న­ట్లు, అనం­త­రం ని­ర్మా­ను­ష్య ప్రాం­తా­ని­కి తీ­సు­కె­ళ్లి అత్యా­చా­రం చే­సి­న­ట్లు నిం­ది­తు­డు ఒప్పు­కు­న్నా­డు. ఆ తర్వాత తన నేరం బయ­ట­ప­డు­తుం­ద­నే భయం­తో బా­లి­క­ను గొం­తు ను­లి­మి హత్య చే­సి­న­ట్లు వి­చా­ర­ణ­లో వె­ల్ల­డిం­చి­న­ట్లు పో­లీ­సు­లు తె­లి­పా­రు. నిం­ది­తు­డి­ని ప్ర­శ్నిం­చిన పో­లీ­సు­లు బా­లిక ఎక్కడ ఉం­ద­ని అడ­గ­గా, రా­త్రి సు­మా­రు ఒకటి గంట ప్రాం­తం­లో అతడు చూ­పిం­చిన చోట చి­న్నా­రి మృ­త­దే­హం లభ్య­మైం­ది. వెం­ట­నే పో­లీ­సు­లు అక్క­డి­కి చే­రు­కు­ని మృ­త­దే­హా­న్ని స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. అనం­త­రం పో­స్టు­మా­ర్టం ని­మి­త్తం ఉస్మా­ని­యా ఆసు­ప­త్రి­కి తర­లిం­చా­రు.

Tags:    

Similar News