SLBC: ఎస్‌ఎల్బీసీలో మానవ అవశేషాలు

కెడావర్ డాగ్స్ గుర్తించిన స్పాట్‌లో తవ్వకాలు... కనిపించిన మానవ అవశేషాలు;

Update: 2025-03-09 05:30 GMT

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులు కీలక సమాచారం ఇచ్చారు. కెడావర్ డాగ్స్ గుర్తించిన స్పాట్‌లో తవ్వకాలు చేసిన రెస్క్యూ సిబ్బందికి మానవ అవశేషాలు కనిపించాయి. దీంతో అక్కడ మరింత లోతుగా తవ్వేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు టీబీఎం మెషిన్‌ విడిభాగాలు అడ్డంకిగా మారాయి. వాటిని తొలగించి మరింత లోతుకు వెళ్లేందుకు యత్నిస్తున్నారు.

16వ రోజుకు చేరిన టన్నెల్‌ రెస్క్యూ

SLBC టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ 16వ రోజుకు చేరింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్నారు. టన్నెల్ ఎండ్ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. ఈ స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్లు తవ్వకాలు చేపట్టారు. మరోవైపు జీపీఆర్, క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు.

భారీగా దుర్వాసన!

SLBC టన్నెల్‌ ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో రెండు స్పాట్స్ గుర్తించారు. ఆ రెండు స్పాట్స్‌లో రెస్క్యూ బృందాల తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తవ్వే చోట భారీగా దుర్వాసన వస్తున్నట్లు రెస్క్యూ టీమ్ చెబుతోంది. 15వ రోజు సహాయక చర్యల్లో ఈ కీలక అప్డేట్ వచ్చింది.

మంత్రి ఉత్తమ్ సమీక్ష

ఎస్ఎల్బీసీ కెనాల్లో జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పరిశీలించారు. సహాయ చర్యలపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్ష చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్పై సమగ్ర సమాచారం తీసుకుంటూ తగిన సూచనలు అందించారు. ప్రస్తుత పరిస్థితిని మదింపు చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News